వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ చిత్రం “సర్కారు వారి పాట”కు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. అంతే కాకుండా ఈ హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలనే స్ట్రాంగ్ ఉద్దేశంతోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని మేకర్స్ తీసుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు అయితే మహేష్ తో ఏదో గట్టుగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
యాక్షన్ మేకింగ్ నుంచి మహేష్ లుక్స్ వరకు ప్రతీది పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తుంది. అయితే మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మహేష్ ఈ సినిమాలో ఇంతకు ముందు ఏ సినిమాలోని కనిపించని విధంగా సాలిడ్ ఫిట్నెస్ లెవెల్స్ తో కనిపించడం ఖాయం అని తెలుస్తుంది. దీనితో మహేష్ పర్శనాలిటీ ఈ సినిమాలో సాలిడ్ గా కనిపించబోతుంది అని తెలుస్తుంది.
ఇప్పటి మహేష్ ఈ సినిమాలో కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటన్నిటినీ చూస్తుంటే మహేష్ నుంచి గట్టి ట్రీటే ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటెర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.