ఇటీవలే 2011 నంది అవార్డుల జాబితాను విడుదల చేసారు. ఈ అవార్డులు నిర్ణయించే టైంలో ‘ప్రయోగం అనే సినిమా జ్యూరీ మెంబర్స్ అందరి మనసును గెలుచుకుంది. చాలా సరికొత్తగా తీసిన ఈ సినిమా చూసిన వారందరికీ బాగా నచ్చింది, కానీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాకపోవడంతో ఈ చిత్ర నిర్మాత మరియు దర్శకుడి భాను ప్రకాష్ కి నష్టాలను తెచ్చి పెట్టింది. 2011 నంది అవార్డ్స్ లో ఉత్తమ మొదటి చిత్ర దర్శకుడి విభాగంలో భాను ప్రకాష్ నంది అవార్డు గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘ భాను సరి కొత్త కాన్సెప్ట్ మరియు సరికొత్త టెక్నాలజీతో చాలా అద్భుతంగా సినిమా తీసాడు. మన సినిమాలు ఒక్క నంది అవార్డులతోనే ఆగి పోకూడదు, నేషనల్ అవార్డ్స్ కూడా గెలుచుకోవాలి. ఈ ‘ప్రయోగం’ సినిమాకి నంది అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని’ అన్నారు. అలాగే మరో మంచి విషయాన్ని ప్రస్తావించారు అదేమిటంటే ‘ ఒక సినిమాని తీయడం కంటే దాన్ని ఆడియన్స్ ముందుకి తీసుకెళ్లడం చాలా ముఖ్యమన్నారు. రిలీజ్ ముందు మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ బాగా ఉండాలి. ఒక మంచి సినిమా తీసినప్పుడు అది ప్రేక్షకులకి ఎందుకు నచ్చలేదా అని ఆలోచించే కంటే ఎందుకు ప్రేక్షకులకు చేరువకాలేదు అని ఆలోచించడి అని’ ఆయన అన్నారు.
‘ప్రయోగం’ చిత్ర దర్శకుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ ‘ చాలా కాలంగా నా మదిలో తిరుగుతున్న కొన్ని కాన్సెప్ట్స్ తో ఈ సినిమా తీశాను. సినిమా కూడా చలా బాగా వచ్చింది, కానీ థియేటర్లు ఎక్కువగా అందుబాటులో లేనందువల్ల ఎక్కువగా విడుదల చేయకపోవడంతో ప్రేక్షకులకు చేరువ కాలేదు. నాకు వచ్చిన ఈ అవార్డు భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు తీయాలనే స్పూర్తినిచ్చిందని’ అన్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు ఈ భావనతో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి.