ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న పలు భారీ ప్రాజెక్ట్ లలో కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. అయితే ఈ సినిమాను అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొనడం ఇటీవలే షూటింగ్ మొదలు కావడం ఒక షెడ్యూల్ ముగియడం శరవేగంగా జరిగిపోయాయి.
మరి ఈ గ్యాప్ లోనే అసలు ఈ సినిమా కథ ఏంటి కొత్తదా లేక రీమేక్ సినిమానా అని చాలానే స్పెక్యులేషన్స్ నడిచాయి. అలాగే ఇది ఎలాంటి రీమేక్ కానీ కాపీ సినిమా కాదని పూర్తిగా ప్రభాస్ కోసం సిద్ధం చేసిన కథే అని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చినట్టుగా పలు కథనాలు బయటకు వచ్చాయి.
కానీ ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు తెర పడ్డట్టే అయ్యింది. ఈ కాంబోలో వస్తున్న ఈ భారీ చిత్రం ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన “ఉగ్రమ్” సినిమాకు రీమేకే అని అది తెలిసిందే కదా అని కేజీయఫ్ కు ఇప్పుడు సలార్ కు సంగీతం అందిస్తున్న రవి బాసృర్ క్లారిటీ ఇచ్చేసాడు.
కన్నడలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం బహిర్గతం అయ్యింది. అంతే కాకుండా అక్కడ నుంచి ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. సో సలార్ ఒక రీమేక్ సినిమా అని ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చింది. మీకు అంతగా డౌట్ ఉంటే యూట్యూబ్ లో వెతికినా ఈ సమాచారం కోసం కనిపిస్తుంది.