ఆరోజున “ఆదిపురుష్” భారీ అప్డేట్ ఉంటుందా.?

ఆరోజున “ఆదిపురుష్” భారీ అప్డేట్ ఉంటుందా.?

Published on Feb 20, 2021 1:00 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఇందులో ప్రభాస్ రాముని పాత్రలో అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే మరి ఈ భారీ ప్రాజెక్ట్ తాలుకా మోషన్ కాప్చర్ వర్క్ సహా షూటింగ్ కూడా ఇటీవలే మొదలయిన సంగతి తెలిసిందే. అలాగే రిలీజ్ డేట్ ను కూడా తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి మరో సాలిడ్ అప్డేట్ వచ్చేది అప్పుడే అని ఓ డేట్ కన్ఫర్మ్ అంటున్నారు. అదే వచ్చే ఏప్రిల్ 21 న శ్రీరామ నవమి సందర్భంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఆరోజున ఈ చిత్రం నుంచి ఏ అప్డేట్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. టాక్ అయితే ఆ స్పెషల్ రోజున ఫస్ట్ లుక్ పోస్టరే వస్తుందని అంటున్నారు. కానీ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ కూడా ఇంకొకటి ఉంది. అదే ఈ చిత్రంలో సీత ఎవరు అని..మరి ఈ అప్డేట్ ను కానీ ఆరోజున రివీల్ చేస్తారా అన్నది చూడాలి. మొత్తానికి మాత్రం ఆరోజు భారీ అప్డేట్ ఫిక్స్ అనే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు