43 ఏళ్ల క్రితం.. చిరంజీవి మీద మొదటి సన్నివేశం

43 ఏళ్ల క్రితం.. చిరంజీవి మీద మొదటి సన్నివేశం

Published on Feb 11, 2021 10:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానానికి నాలుగు దశాబ్దాల వయసుంది. మామూలు సాదా సీదా నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా, సుప్రీమ్ హీరోగా ఆతర్వాత మెగాస్టార్ స్థాయికి ఆయన ఎదిగిన తీరు అనిర్వచనీయం. స్వయంకృషితో ఆయన సాగించిన ప్రయాణం ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఈరోజు ఫిబ్రవరి 11వ తేదీకి చిరు నటనా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే 43 ఏళ్ల క్రితం ఇదే ఫిర్బ్రవరి 11న ఆయన మీద మొట్ట మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ‘ప్రాణం ఖరీదు’ చిరంజీవి నుండి విడుదలైన మొదటి సినిమానే అయినా ఆయన మొదటగా నటించిన చిత్రం మాత్రం ‘పునాది రాళ్లు’ అనేది అందరికి తెలిసిన సంగతే. ఆ సినిమాలో చిరు మీద మొదటి సన్నివేశాన్ని ఇదే రోజున తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లిలో చిత్రీకరించారు. ఆ సన్నివేశానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం చిరు తన 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్నారు. అవి కాకుండా మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీలతో సినిమాలను ఫైనల్ చేసి పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు