“30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” డే 1 నైజాం వసూళ్లు ఇవే.!

“30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” డే 1 నైజాం వసూళ్లు ఇవే.!

Published on Jan 30, 2021 5:15 PM IST

స్మాల్ స్క్రీన్ పై మరియు ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు తాను హీరోగా నటించిన మొట్ట మొదటి సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” చాలా కాలం విరామం అనంతరం థియేటర్స్ లోనే విడుదల అయ్యింది. అయితే సినిమా టాక్ ను పక్కన పెడితే ఈ చిత్రానికి గాను మొదటి రోజు అన్ని చోట్లా కూడా మంచి వసూళ్లే అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఆలా ఎంతో కీలకం అయినటువంటి నైజాం లో ఈ సినిమా డే వసూళ్ల లెక్కలు ఇపుడు బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి గాను మొదటి రోజు కోటి రూపాయలకు పైగానే గ్రాస్ ను రాబట్టగా 43 లక్షల షేర్ ను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది
ప్రదీప్ మొదటి సినిమాకు మంచి ఓపెనింగ్ అని చెప్పాలి. అంతే కాకుండా ఓవరాల్ గా కూడా వరల్డ్ వైడ్ మంచి వసూళ్లే వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వీరి చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకల్లో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు