ఛార్మి హీరోయిన్ గా నటించిన ‘ ప్రతిఘటన’ ఏప్రిల్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 4న విడుదల చేయాలని ఈ చిత్ర నిర్మాతలు ముందుగా భావించినప్పటికీ, ఏప్రిల్ 18 న ఈ చిత్రం విడుదల అవుతుందని ఛార్మి తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రానికి డైరెక్టర్ గా వ్యవహరించారు. మహిళపై జరుగుతున్న దురాగతాలకు, వాస్తవాలకు దగ్గరగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రేష్మా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో, న్యాయం కోసం పోరాడే ఓ జర్నలిస్ట్ గా ఛార్మి కనిపించనున్నారు.
ఇటీవలే ఈ చిత్రాన్నికొద్దిమందికి మాత్రమే ప్రదర్శించారు. సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి ఈ చిత్రంపై మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో ఛార్మి సంతోషంగా ఉన్నారట. కాగా ‘ప్రతిఘటన’ ఛార్మి కెరీర్ లో 50 వ చిత్రం.