ఏప్రిల్ 18న విడుదలకానున్న లడ్డూబాబు?

ఏప్రిల్ 18న విడుదలకానున్న లడ్డూబాబు?

Published on Mar 27, 2014 10:10 PM IST

allari-naresh-laddu-babu
అల్లరి నరేష్ తాజా చిత్రం లడ్డూ బాబు సినిమాలో హీరో వేసుకున్న ప్రొస్తెటిక్ మేక్ అప్ పుణ్యమా అని సినిమాపై అంచనాలను పెంచింది. దాదాపు 228కె.జిలు వుండే ఒక పెళ్ళికాని వ్యక్తి తన వివాహంకోసం పడే తపనే ఈ సినిమా కధ అని దర్శకుడు రవిబాబు తెలిపాడు

“మమోలుగా మేక్ అప్ అనేది కొన్ని గంటల, మహా అయతే ఒకటి రెండు రోజుల వ్యవహారం. కానీ ఈ సినిమాలో నరేష్ తన మేక్ అప్ కోసం దాదాపు 70రోజులు కష్టపడ్డాడు. ఎంత బాధ అనిపించినా ఒక్కసారి కుడా దాన్ని బయటపెట్టలేదు. ఆయనకు హ్యాట్స్ ఆఫ్” అని దర్శకుడుచెప్పుకొచ్చాడు. భూమిక చావ్లా, పూర్ణ ఈ సినిమాలో హీరోయిన్స్

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 18న మనముందుకు రానుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. చక్రి సంగీతదర్శకుడు

తాజా వార్తలు