రియాలిటీకి దగ్గరగా యాక్షన్ డ్రామా సినిమాలు చేసే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డా. మోహన్ బాబు, మంచు విష్ణు హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘రౌడీ’. ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మాములుగా వర్మ సినిమాలకి నార్త్ ఇండియా, గ్లోబల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది కావున చూసే వారికి భాష సమస్య కాకూడదని ఈ సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నారు.
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయి. మోహన్ బాబు బాగా రియలిస్టిక్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీ ట్రైలర్స్, విజువల్స్, డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జయసుధ, శాన్వి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. మంచు ఫ్యామిలీ హీరోస్ – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.