‘రామయ్యా వస్తావయ్యా’ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

‘రామయ్యా వస్తావయ్యా’ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Sep 22, 2013 11:46 AM IST

ntr-in-rv

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రామయ్యా వస్తావయ్యా’. నిన్న సాయంత్రం ప్రముఖుల సమక్షంలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ చిత్ర ట్రైలర్ కి ప్రతి ఒక్కరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ లో ఎన్.టి.ఆర్ చెప్పిన డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చుతున్నాయి.

డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ని చాలా కొత్తగా చూపించాడు. ఎన్.టి.ఆర్ ఫ్రెష్ అండ్ స్టైలిష్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దిల రాజు నిర్మించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు