అక్కినేని వారు అర్ధరాత్రి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి?

అక్కినేని వారు అర్ధరాత్రి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి?

Published on Sep 19, 2013 8:02 PM IST

akkineni_family_heroes

గత కొన్ని గంటలుగా అక్కినేని ఫ్యాన్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ లోని వారు నేటి అర్ధరాత్రికి ఏదో సర్ప్రైజ్ ఉందని చెబుతున్నారు. అందరం అది ‘మనం’ ఫస్ట్ లుక్ అని ఆశించారు. కానీ అది కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసేసారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేసిన తర్వాత నాగార్జున గారు కూడా ఆ అర్ధరాత్రి సర్ప్రైజ్ గురించి ట్వీట్ చేసారు.

‘మీకు మరో సర్ప్రైజ్ ఉంది. అది అర్ధరాత్రి 12 గంటలకి తెలియజేస్తాం అని’ నాగార్జున ట్వీట్ చేసాడు.

ఈ విషయంపై ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ అక్కినేని ఇంట్రడక్షన్ మూవీ గురించి అనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి కొంతమంది ఏమో అఖిల్ కి సంబందించిన కొన్ని స్పెషల్ ఫొటోస్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఈ విషయంలో ఏది నిజమనేది ఇంకా తెలియడం లేదు.

అక్కినేని వారు 12 గానతలకి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. అప్డేట్స్ కోసం సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

తాజా వార్తలు