ముగిసిన ‘భాయ్’ సినిమా షూటింగ్

ముగిసిన ‘భాయ్’ సినిమా షూటింగ్

Published on Sep 15, 2013 4:30 PM IST

Bhai

నాగార్జున హీరోగా నటిస్తున్న ‘భాయ్’ సినిమా షూటింగ్ ముగిసింది. ఒక పాట మాత్రమే పెండింగ్ లో వుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్టింగ్స్ వేయడం జరిగింది. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటి ప్రసన్న ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. వీరభద్రం దర్శకత్వం వహించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తను చాలా అందంగా వున్నడని సమాచారం. అలాగే ఈ సినిమాని యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. వీరభద్రం గతంలో ‘ఆహా నా పెళ్ళంట’, పూలరంగడు’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జున మాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా చాలా జాగ్రతలు తీసుకున్నాడు. ఈ సినిమా పేరు ‘భాయ్’ కానీ ఈ సినిమాలో మాఫియాకు సంబంధం లేదని నాగార్జున అన్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు