మహేష్ నవంబర్ జాతర నెల షురూ!

మహేష్ నవంబర్ జాతర నెల షురూ!

Published on Nov 1, 2025 8:01 AM IST

SSMB29

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా నుంచి మరో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్డేట్ ని ఈ నవంబర్ నెలలో అందిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఒక సాలిడ్ ప్రీ లుక్ పోస్టర్ తోనే టోటల్ ఇండియా షేక్ అయ్యింది.

ఇక అంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నవంబర్ నెల రానే వచ్చింది. దీనితో మహేష్ నవంబర్ నెల జాతర షురూ అయ్యిందనే చెప్పి తీరాలి. ఇక ఈ నెలలో జరిగే అద్భుతం ఒక్క దానిపైనే అందరి కళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరి జక్కన్న మహేష్ లాంటి స్టార్ తో ఎలాంటి ఫీస్ట్ ని ప్లాన్ చేశారో వేచి చూడాలి.

తాజా వార్తలు