వచ్చే ఏడాది రిలీజ్ కోసం ఆల్రెడీ పలు భారీ సినిమాలు లైన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీటిలో ఒకో ఇండస్ట్రీ బిగ్ స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. మరి ఆ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ కూడా ఒకటి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాకి ఇప్పుడు వరకు క్లాష్ లేదు.
కానీ డెకాయిట్ తో యంగ్ హీరో అడివి శేష్ అదే డేట్ లో ఇపుడు ఛాలెంజ్ విసిరాడు. దీనితో ఈ క్లాష్ మన తెలుగు, హిందీ వరకు టాక్సిక్ కి కొంచెం అయినా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పాలి. అయితే టాక్సిక్ చిత్రానికి లోలోపల చాలా తతంగం నడుస్తోంది అని టాక్ ఉంది. మరి ఆ టైం కి అయినా సినిమా వస్తుందో లేదో అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి


