‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్స్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా ‘డ్యూడ్’ అంటూ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో మనముందుకు వచ్చాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా మేకర్స్ మంచి బజ్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ మమితా బైజు హీరోయిన్‌గా నటించింది.
కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. యూత్‌ఫుల్ కంటెంట్‌కు ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీపావళి సెలవులు కూడా ఉండటంతో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. 4 రోజుల్లో డ్యూడ్ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.83 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. దీపావళి బరిలో రిలీజ్ అయిన మిగతా చిత్రాల పోటీని సైతం ఎదుర్కొని ఈ సినిమా ధీటుగా దూసుకెళ్తుండటం విశేషం.