కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఉన్న వారిలో నటుడు సూర్య కూడా ఒకరు. ఇప్పుడు కరుప్పు అలాగే మన తెలుగులో దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సూర్య లైనప్ లో ఉన్న మరో చిత్రం దర్శకుడు జీతూ మాధవన్ తో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మలయాళ టాలెంటెడ్ అండ్ స్టార్ నటుడు సాలిడ్ రోల్ కి లాక్ అయినట్టుగా తెలుస్తుంది.
మరి ఆ నటుడు ఎవరో కాదట ఫహద్ ఫాజిల్ అని తెలుస్తుంది. సూర్య ఆ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ రోల్ లో నటించనున్నాడని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సూర్య కరుప్పు చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్. దీనిపై కూడా అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.