అఖిల్ ‘లెనిన్’లో సీనియర్ హీరో ?

అఖిల్ ‘లెనిన్’లో సీనియర్ హీరో ?

Published on Oct 19, 2025 8:00 AM IST

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఈ సినిమా టాకీ పార్ట్ 80% పూర్తి అయింది. ఇక ఒక షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఐతే, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్రలో ఓ సీనియర్ హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా నడుస్తోందని టాక్ నడుస్తోంది. మరి ఆ సీనియర్ హీరో ఎవరు అనేది చూడాలి.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – శ్రీలీల కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది.

తాజా వార్తలు