అడ్వాన్స్ సేల్స్ లో ‘ఓజి’ ర్యాంపేజ్!

అడ్వాన్స్ సేల్స్ లో ‘ఓజి’ ర్యాంపేజ్!

Published on Sep 24, 2025 11:44 AM IST

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. ఓజాస్ గంభీర గా పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఎలాంటి సినిమా చూడాలని ఎన్నో ఏళ్ళు తరబడి ఎదురు చూస్తున్న అభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చేలా సుజీత్ చేసిన ఈ చిత్రం భారీ హైప్ ని సొంతం చేసుకుంది. ఇలా అనౌన్స్ చేసిన నాటి నుంచి నేడు థియేటర్స్ లో బొమ్మ పడేంత వరకు కూడా నెక్స్ట్ లెవెల్ యుఫోరియా ఈ సినిమా చూసింది.

ఇలా వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన ఈ చిత్రం ఇపుడు రికార్డు అడ్వాన్స్ సేల్స్ నడుస్తున్నాయి. ఇలా ఆల్రెడీ నిన్నటికే 50 కోట్ల మార్క్ ని దాటేసిన ఓజి ఇపుడు రిలీజ్ కి దగ్గరకి వస్తున్న నేపథ్యంలో 75 కోట్ల దగ్గరకి ఈ మార్క్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఓజి మాత్రం ఒక ర్యాంపేజ్ ని చూపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు