‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!

‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Sep 18, 2025 9:00 AM IST

Akhanda2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకోవచ్చింది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆ అప్డేట్ కోసం కూడా చూస్తున్నారు.

మరి ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం మేకర్స్ ఓ పార్టీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. నేటి నుంచే షూట్ మొదలు కానుండగా ఒక స్పెషల్ సెట్ వేసి అందులో ఈ సాంగ్ ని హైదరాబాద్ లోనే తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సాంగ్ కూడా అయిపోతే ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయినట్టే అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు