తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మిక్సిడ్ టాక్‌ను తెచ్చుకుంది. అయినా, బాక్సాఫీస్ దగ్గర నిలకడగా ఈ చిత్రం రన్ అవుతుంది.
ఇక ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు ఈ మూవీకి సాలిడ్ వసూళ్లు వచ్చేలా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉండే. దీంతో ఈ సినిమా తొలిరోజే అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం నెమ్మదిగా ఈ చిత్ర వసూళ్లు కంటిన్యూ అవుతున్నాయి.
అయితే, ఈ సినిమాకు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్ స్క్వేర్‌లో కూలీ చిత్ర పోస్టర్ ప్రదర్శించారు. చాలా తక్కువ సినిమాలకు ఇలాంటి ఫీట్ చేసే ఛాన్స్ వస్తుంది. కూలీ సినిమాకు ఈ ఛాన్స్ రావడంతో రజనీ కాంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.