రజినీకాంత్‌తో ‘భాషా’ సీక్వెల్ ప్లాన్ చేసిన తెలుగు డైరెక్టర్.. కానీ..!

రజినీకాంత్‌తో ‘భాషా’ సీక్వెల్ ప్లాన్ చేసిన తెలుగు డైరెక్టర్.. కానీ..!

Published on Jul 19, 2025 2:00 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో కల్ట్ చిత్రంగా నిలిచింది ‘భాషా’. దర్శకుడు సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ప్యూర్ మాస్ యాక్షన్ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌ను ఓ తెలుగు డైరెక్టర్ చేయాలని ప్లాన్ చేశాడు.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా అదిరిపోయే హిట్ అందుకున్నాడు వశిష్ట మల్లిడి. అయితే, ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బింబిసార సినిమా ఇచ్చిన సక్సెస్ తర్వాత ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో చేయాల్సింది ఉందట.

అయితే, ఈ సినిమాలో హీరోగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించాల్సిందని.. ఇది భాషా చిత్రానికి సీక్వెల్‌గా ప్లాన్ చేశామని.. రజినీకాంత్‌కు కథ కూడా నచ్చిందని.. కానీ, కథలో ఏదో లోటు ఉందని తాను భావించానని.. అందుకే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని వశిష్ట తెలిపాడు. ఇలా భాషా సీక్వెల్ చిత్రం చేయాల్సిన అవకాశం వచ్చినా, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంపై వశిష్ట క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు