టాలీవుడ్ సినిమా దగ్గర మరో విషాదం ఇపుడు నెలకొంది. ఇటీవలే కొందరు ప్రముఖులు కన్నుమూశారనే వార్తలు ఎంతో బాధించాయి. కానీ అవి మరిచే లోపే మరో విషాదం చోటు చేసుకుంది. మరో ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు కన్ను మూశారు.
అయితే గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఫిష్ వెంకట్ ఇప్పుడు సరైన సమయంలో డబ్బులు, కిడ్నీ అందక కన్ను మూసారనే మాట తెలుగు ప్రేక్షకులను మరింత బాధిస్తుంది. ఎన్నో సినిమాల్లో నెగిటివ్ పాత్రలు వాటికి మించి కామెడీ పాత్రలు కూడా చేసి అలరించిన ఫిష్ వెంకట్ జీవితం ఇలా ముగుస్తుంది అని ఎవరూ ఊహించలేదు.
నిన్న రాత్రి ట్రీట్మెంట్ కి తన శరీరం సహకరించకపోవడంతో తను తుది శ్వాస విడిచారు. ఇది మాత్రం ఒక తీరని విషాదం. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123 యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.