చిరు – అనీల్ ప్రాజెక్ట్ లీక్స్ పై మేకర్స్ సీరియస్.. ప్రెస్ నోట్ తో హెచ్చరిక

చిరు – అనీల్ ప్రాజెక్ట్ లీక్స్ పై మేకర్స్ సీరియస్.. ప్రెస్ నోట్ తో హెచ్చరిక

Published on Jul 19, 2025 2:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై కొన్ని లీక్స్ ఇటీవల అందరికీ షాకిచ్చాయి. ఇక దీనిపై లేటెస్ట్ గా మేకర్స్ అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసి హెచ్చరిక జారీ చేశారు.

ఎప్పుడు, అసలేం లీక్ వచ్చింది?

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న చిరు – అనీల్ ల చిత్రం షూటింగ్ స్పాట్ నుంచి చిరు, నయన్ లపై కొన్ని సన్నివేశాల పిక్స్ నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. వీటిపై యాక్షన్ నిమిత్తమే ఇపుడు మేకర్స్ ప్రెస్ నోట్ ద్వారా స్పందించారు.

నిర్మాణ సంస్థ ఏం చెబుతుందంటే?

చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వారు మెగాస్టార్ 157 సినిమా షూటింగ్ సెట్స్ నుంచి బయటకి వచ్చిన విజువల్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు చెబుతున్నారు. తమ బ్యానర్ లో ఈ సినిమాని ఎంతో శ్రమించి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని సో ఎవరైనా లీక్స్ ని షేర్ చేసినా బయటపెట్టినా లీగల్ సమస్యలు ఎదుర్కోవడం తప్పదని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు