ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” అని చెప్పొచ్చు. దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కించిన ఈ భారీ సినిమా రిలీజ్ విషయంలో మరిన్ని ఆసక్తికర డీటెయిల్స్ ఇపుడు బయటకి వచ్చాయి.
‘హరిహర వీరమల్లు’కి పైడ్ ప్రీమియర్స్
సాధారణంగా యూఎస్ మార్కెట్ లో ముందు రోజే ప్రీమియర్స్ పడతాయి. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎర్లీ షోస్ ఉంటాయని టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా నిర్మాత ఏ ఎం రత్నం సాలిడ్ అప్డేట్ ని అభిమానులకి అందించారు. దీనితో ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం ఇండియా వైడ్ గా గ్రాండ్ గా పైడ్ ప్రీమియర్స్ ని పెడుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
తేదీ, సమయం
సినిమా రిలీజ్ జూలై 24 గురువారం అయితే ప్రీమియర్స్ మాత్రం ముందు రోజు అంటే బుధవారం జూలై 23 రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే వీరమల్లు జాతర మొదలైపోతుంది అని కన్ఫర్మ్ చేశారు.
పైడ్ ప్రీమియర్స్ కి అడ్డంకులు?
నిర్మాత ఏ ఎం రత్నం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్స్ తీసుకుంటామని చెబుతున్నారు. అయితే గతంలో పుష్ప 2 ప్రీమియర్స్ కి ఏర్పడిన పరిస్థితులు అందరికీ తెలిసిందే. మరి దీనితో ఏపీలో పర్మిషన్ వచ్చినా తెలంగాణాలో మాత్రం అధికారిక ప్రకటన వచ్చేవరకు సస్పెన్స్ తప్పదు.