సమీక్ష: ‘జూనియర్’ – కిరీటి వన్ మ్యాన్ షో మాత్రమే

సమీక్ష: ‘జూనియర్’ – కిరీటి వన్ మ్యాన్ షో మాత్రమే

Published on Jul 18, 2025 3:37 PM IST

Junior Movie Review

విడుదల తేదీ : జూలై 18, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, వి రవిచంద్రన్, రావు రమేష్, వైవా హర్ష, అచ్యుత్, సత్య తదితరులు
దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి
నిర్మాత : దేవిశ్రీ ప్రసాద్
సంగీతం : రజినీ కొర్రపాటి, సాయి కొర్రపాటి
సినిమాటోగ్రఫీ : కే కే సెంథిల్
ఎడిటర్ : నిరంజన్ దేవరమనే

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతూ శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమానే “జూనియర్”. గట్టి ప్రమోషన్స్ నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన చిన్నతనం నుంచే తన నాన్న కోదండపాణి (వి రవిచంద్రన్) వల్ల మిస్సయిన ప్రతీ మెమొరీని మళ్ళీ తెచ్చుకోవాలని లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలని చూసే బ్రైట్ స్టూడెంట్ అభినవ్ (కిరీటి) తన యంగ్ లైఫ్ ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాడు. ఇలా స్ఫూర్తి (శ్రీలీల) ని ఇష్టపడి ఆమె జాబ్ లో చేరిన కంపెనీ రైస్ సొల్యూషన్స్ లో జాయిన్ అవుతాడు. అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇక్కడ నుంచి వీరి ప్రయాణం ఎలా సాగింది? అభికి విజయకి ఉన్న లింక్ ఏంటి? సౌజన్యకి సీఈఓ అయ్యేముందు ఎదురైనా సవాళ్లు ఏంటి? అభి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాతో యంగ్ హీరో కిరీటి ఒక సాలిడ్ డెబ్యూ ఇచ్చాడని చెప్పవచ్చు. కంటెంట్ పరంగా పక్కన పెడితే జూనియర్ సినిమా తన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హీరోగా తన రోల్ లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్టైలిష్ మ్యానరిజంలతో ఇంప్రెస్ చేసాడు.

వీటి అన్నిటినీ మించి కిరీటి డాన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపేసాడానికి చెప్పొచ్చు. ఫస్ట్ సాంగ్ నుంచి శ్రీలీలతో స్పెషల్ సాంగ్ వరకు స్టైలిష్ గా ప్రతీ స్టెప్ పర్ఫెక్ట్ కట్ తో ఈజ్ గా చేసేసాడు. ముఖ్యంగా శ్రీలీలతో స్పెషల్ సాంగ్ అయితే ఆమెనే డామినేట్ చేసేసాడు. జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి గ్రేస్ మిక్స్ చేసినట్టుగా డాన్స్ పరంగా మాత్రం కిరీటికి ఎక్కువ మార్కులే అందుకున్నాడు.

ఇక శ్రీలీల తన రోల్ లో పర్వాలేదు. స్పెషల్ సాంగ్ లో ఇంకా బాగుంది. అలాగే వి రవిచంద్రన్ తన రోల్ లో బాగా చేసారు. తనపై ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ అలానే కొన్ని ఎమోషనల్ సీన్స్ సెకండాఫ్ లో బాగున్నాయి. ఇంకా రావు రమేష్ తన పాత్రలో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

యంగ్ హీరో కిరీటి తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించేందుకు ఈ డెబ్యూ ఎంచుకున్నాడో ఏమో కానీ కంటెంట్ పరంగా మాత్రం డిజప్పాయింట్ చేసాడు. తన టాలెంట్ కి తగ్గట్టుగా సాలిడ్ కథా, కథనాలు ఉండే కొత్త తరహా కంటెంట్ ని పట్టుకొని ఉంటే తన డెబ్యూకి మరింత కలిసొచ్చేది. కానీ ఈ సినిమాలో అలాంటిది లేదు.

పైగా పరమ బోరింగ్ కథా కథనాలు చాలా సినిమాలు కలిపి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా ఈ సినిమా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అయితే దారుణంగా సాగుతుంది. మినిమమ్ ఎంగేజ్ చేసే అంశాలు కనిపించవు. ఏదో వెళుతుంది అంటే వెళ్తున్నట్టు ఉంటుంది అంతే. ఒక సీన్ కి మరో సీన్ కి సరిగ్గా ఫ్లో కూడా లేదు. ఇదే తంతు ఇంటర్వెల్ వరకు కొనసాగుతుంది.

ఇక ఇలాంటి డల్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ లో కొంతమేర ఓకే కానీ మళ్ళీ తర్వాత పరమ రొటీన్ స్క్రీన్ ప్లే బోరింగ్ సన్నివేశాలతో సాగుతుంది. కొంచెం పర్వాలేదు అనిపించే ఆ ఎమోషనల్ సీన్స్ కూడా లేకపోతే ఈ చిత్రం మరింత డిజప్పాయింట్ చేసేది. ఈ సినిమాలో తారాగణం పరంగా కూడా మేకర్స్ తగ్గలేదు. అయితే ఈ తారాగణంని సరిగా వాడుకోలేదు అనిపిస్తుంది.

శ్రీలీల నామమాత్రం గానే ఉంది, జెనీలియా లాంటి నటిని పెట్టుకొని ఆమెకో డల్ అండ్ అర్ధం లేని పాత్ర ఇచ్చారు. ఆమె నటనకి గాని సినిమాలో ప్రభావంతంగా చూపే పాత్రగా కానీ ఏవి ఎఫెక్టీవ్ గా అనిపించలేదు. అలాగే సినిమాలో ప్రతినాయక పాత్ర కూడా బలహీనంగా ఉంటుంది. ఎంతో బిల్డప్ ఇచ్చి సింపుల్ గా ముగించేస్తారు. నటుడు అచ్యుత్, ఇంకా ఇతర కొందరి పాత్రలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బాగుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. కొన్ని కొన్ని సీన్స్ ఒకదానికి ఒకటి లింక్ లేకుండా సింక్ మిస్ అయ్యినట్టు కనిపిస్తాయి.

ఇక దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి విషయానికి వస్తే.. తాను కిరీటిని బాగా చూపించే యత్నంలో కథా, కథనాలు వదిలేసారు. పరమ రొటీన్ కథను పట్టుకొని కేవలం కొన్ని మూమెంట్స్ తప్ప మిగతా కథనం అంతా బోరింగ్ అండ్ అవుట్ డేటెడ్ గానే అందించారు. వీటితో తన వర్క్ మాత్రం అంతగా ఆకట్టుకోదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “జూనియర్” సినిమా కిరీటి నుంచి తానేంటో చూపించుకునే డెబ్యూ అని చెప్పొచ్చు. తాను మంచి ఎఫర్ట్స్ పెట్టి షైన్ అయ్యాడు. కానీ కంటెంట్ పరంగా మాత్రం అంతగా సినిమా ఆకట్టుకోదు. ఎక్కడో కొన్ని మూమెంట్స్ తప్పితే మిగతా సినిమా అంతా డల్ గానే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు