మరో విషాదం: హీరో రవితేజకి పితృ వియోగం!

మరో విషాదం: హీరో రవితేజకి పితృ వియోగం!

Published on Jul 16, 2025 7:36 AM IST

మన తెలుగు సినిమాకి సంబంధించి ఊహించని విషాద ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఇపుడు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులు కితమే దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి, మొన్ననే లెజెండరీ నటులు కోట శ్రీనివాసరావు గారు లాంటి వారు తమ తుది శ్వాస విడిచిన ఘటనలు మరవకుండానే ఇపుడు మరో విషాద వార్త బయటకి వచ్చింది.

మరి ఇది కూడా ప్రముఖ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంట జరగడం బాధాకరం. అయితే రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు గారు తన 90వ ఏట తన తుది శ్వాస విడిచినట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ లోనే రవితేజ ఇంట ఆయన తుదిశ్వాస విడిచారట.

దీనితో వారి ఇంట తీరని విషాదం నెలకొంది. మరి ఈ వార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ రవితేజకి తన కుటుంబానికి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి రవితేజ తండ్రి ఆత్మకి శాంతి చేకూరాలని ఈ కష్టతర పరిస్థితుల్లో రవితేజకి మరింత మనోధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు