ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ‘మాస్ జాతర’

ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ‘మాస్ జాతర’

Published on Jul 17, 2025 1:02 AM IST

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు భోగవరపు భాను డైరెక్ట్ చేస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.

అయితే, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ ముగిసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట. ఇక ఈ ఓటీటీ రైట్స్‌ను ఏకంగా రూ.20 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు