టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా విష్ణు మంచు ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించాడు. ఇక డా.ఎం. మోహన్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని రాష్ట్రపతి భవనంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు పలువురు మంత్రులు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా భక్త కన్నప్ప చరిత్రను మరోసారి తెలుసుకోవడం సంతోషంగా ఉందని.. నేటి తరానికి మన చరిత్రను గుర్తుకు చేసినందుకు చిత్ర యూనిట్‌ను కొనియాడారు.
‘కన్నప్ప’ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.