పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హార్రర్ కామెడీగా రూపొందిస్తున్నారు. అయితే, ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
కానీ, ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయట. దీంతో ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లు డిసెంబర్ 5న రిలీజ్ చేయలేకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ నిజంగానే డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకపోతే, ఇక మేకర్స్ సంక్రాంతి సీజన్‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి వస్తుంది.
ఈ లెక్కన 2026 సంక్రాంతి బరిలో ‘ది రాజా సాబ్’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. మరి నిజంగానే ఈ సినిమా రిలీజ్‌ను మరోసారి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.