రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు.
అయితే, తాజాగా ఈ చిత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ రేటుకు ఈ చిత్ర ఓటీటీ రైట్స్ అమ్ముడు కావడంతో ఈ మూవీపై నెట్‌ఫ్లిక్స్ ఎంతటి ధీమాగా ఉందో అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. జూలై 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.