‘వీరమల్లు’ కలెక్షన్స్‌కు గండి కొట్టనున్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం..?

‘వీరమల్లు’ కలెక్షన్స్‌కు గండి కొట్టనున్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం..?

Published on Jul 16, 2025 9:01 PM IST

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా మలిచాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.

అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరమల్లు చిత్ర కలెక్షన్స్‌పై ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.200 దాటకూడదని జీవో జారీ చేసింది. ఇది మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ అంశం వీరమల్లు రిలీజ్ అయిన వారం తర్వాత అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో లాంగ్ రన్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఈ సినిమా వసూళ్లకు గండిపడటం ఖాయమని పలువురు సినీ క్రిటిక్స్ అంటున్నారు.

ఈ లెక్కన హరిహర వీరమల్లు చిత్రం కన్నడలోనూ భారీ స్థాయిలో రిలీజ్ కానుండటంతో.. అక్కడ ఈ చిత్రానికి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు