ప్రస్తుతం ఇండియా వైడ్ గా కూడా మన తెలుగు సహా తమిళ దర్శకులకి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారిలో కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. ఇప్పుడు తన రెమ్యునరేషన్ కోసం హాట్ టాపిక్ నడుస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ తో విక్రమ్ సినిమాకి 400 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంటే మిక్స్డ్ టాక్ తో కూడా లియో సినిమా 600 కోట్లకి పైగా అందుకుంది.
ఇక ఇలాంటి లైనప్ తర్వాత వారికి మించిన బిగ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా అంటే లోకేష్ పై చాలా బాధ్యతే ఉంటుంది. ఇలా కూలీ సినిమా కోసం తాను అక్షరాలా 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా తాను తెలిపాడు. దీనికి ఇంట్రెస్టింగ్ వివరణ కూడా ఇచ్చాడు. నిజానికి చాలా మంది దర్శకులు తమ రెమ్యునరేషన్ లాంటివి బయటకి చెప్పుకోరు కానీ లోకేష్ తాను 50 కోట్లు కూలీ సినిమా కోసం తీసుకున్నారా అంటే అవువనే సమాధానం అందించాడు.
తన గత సినిమా 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది అని ఇప్పుడు కూలీ సినిమా చేసే సమయంలో తాను వేరే వ్యాపకాలు ఏవి పెట్టుకోలేదు. రెండేళ్లు ఈ సినిమా కోసమే తాను సమయం వెచ్చించాను అని సో ఆ మొత్తం తీసుకోవడం తన వరకు న్యాయమే అని ఇటీవల హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక తన అవైటెడ్ కూలీ సినిమా ఈ ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.