నార్త్ లో ‘కన్నప్ప’ పరిస్థితి ఇదే!

నార్త్ లో ‘కన్నప్ప’ పరిస్థితి ఇదే!

Published on Jun 29, 2025 1:03 PM IST

మంచు విష్ణు హీరోగా తన లైఫ్ టైం పెర్ఫామెన్స్ ని ఇచ్చిన సినిమానే “కన్నప్ప”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని డే 1 నుంచే ఆడియెన్స్ మన్ననలు పొందింది. అయితే పాన్ ఇండియా లెవెల్లో బిగ్ స్టార్స్ ని సెట్ చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో సాలిడ్ రన్ ని కంటిన్యూ చేస్తుంది. అయితే నార్త్ మార్కెట్ లో ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది ఇపుడు తెలుస్తుంది.

సినీ వర్గాల టాక్ ప్రకారం కన్నప్ప డే 1 కంటే డే 2 హిందీలో 40 శాతం ఎక్కువ జంప్ చూసినట్టు తెలుస్తుంది. దీనితో మొదటి రోజు వసూళ్ల కంటే రెండో రోజు బెటర్ గా పెర్ఫామ్ చేసింది అని చెప్పొచ్చు. అయితే అధికారిక నెంబర్స్ మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక బాలీవుడ్ సైడ్ నుంచి బిగ్ స్టార్ అక్షయ్ కుమార్ మహా శివుని పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తన ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు