ఏ. ఆర్. రెహమాన్ మరియు గౌతం మీనన్ ల కలయిక లో వస్తున్న చిత్రం “ఏక్ దీవానా థా” ఆడియో విడుదలని తాజ్ మహాల్ దగ్గరలో ని అందమయిన ప్రాంతం లో చెయ్యాలి అని అనుకున్నారు. దీనికి పురావస్తు శాఖ వారు అనుమతిని నిరాకరించారు. గతం లో “మేరె బ్రదర్ కి దుల్హన్” చిత్ర నిర్మాణ సమయంలో ఈ ప్రదేశం పాక్షికంగా దెబ్బతినింది. అందువలన ఇంక ఎటువంటి సినిమా కార్యకలాపాలని ఈ ప్రదేశం లో అనుమతించము అని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలని ఆగ్రా లో ఒక హోటల్ లో నిర్వహిస్తున్నారు. “ఏక్ దీవానా థా” చిత్రం తెలుగు లో “ఏ మాయ చేసావే” చిత్రానికి రీమేక్. హిందీ లో ప్రతీక్ బబ్బర్ మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాబోయే సంవత్సరం జనవరి లో ఈ చిత్రం విడుదల కావచ్చని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!