“వకీల్ సాబ్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

“వకీల్ సాబ్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 10, 2020 2:35 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూడు ప్రాజెక్టుల్లో ముందు వరుసలో ఉన్న చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పరిస్థితుల ప్రభావం రీత్యా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఈ చిత్రంలో మిగిలి ఉన్న కొంత షూటింగ్ పార్ట్ ను అతి త్వరలోనే చిత్ర యూనిట్ మొదలు పెట్టనుంది.

అయితే పవన్ ఈ చిత్రం షూట్ కు గాను డిసెంబర్ లో పాల్గొననుండగా చిత్ర యూనిట్ మాత్రం ఇతర టాకీ పార్ట్ కు సంబంధించి ఈ సెప్టెంబర్ చివరి వారంలో మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే తర్వాత పవన్ జాయిన్ అయ్యాక షూట్ అంతటిని డిసెంబర్ ఎండింగ్ కి అలా ఖచ్చితంగా ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు