సమీర ఈ సారైనా మెప్పిస్తుందా?

సమీర ఈ సారైనా మెప్పిస్తుందా?

Published on Nov 27, 2012 7:03 PM IST

హాట్ బ్యూటీ సమీర రెడ్డి తెలుగు తెరపై కనిపించి చాలాకాలం అవుతోంది. సమీర రెడ్డి చివరిగా 2006లో ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన ‘అశోక్’ సినిమాలో కనిపించారు. రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ తో సమీర రెడ్డి మళ్ళీ తెరపై కనిపించనుంది. ఈ ఐటెం సాంగ్లో విక్టరీ వెంకటేష్ కూడా తనతో కలిసి స్టెప్పు లేసారు. ఈ పాటలోని సమీర రెడ్డి స్టిల్స్ కి మంచి రెస్పాన్స్ మరియు పాజిటివ్ టాక్ వస్తోంది.

ఇది చూసిన తర్వాత అందరి మదిలో ఓ ప్రశ్న మొదలైంది అదేమిటంటే సమీర రెడ్డి ఈ సినిమాతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుందా? ప్రస్తుతం ఈ భామ తెలుగులో సినిమాలేమీ చేయకపోవడంతో ఈ విషయం పై సరైన క్లారిటీ లేదు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ రిలీజ్ అయిన తర్వాత అది మారే అవకాశం ఉందేమో చూడాలి. సమీర రెడ్డి ఈ సంవత్సరం ‘వేట్టై’ సినిమాతో తమిళంలో హిట్ అందుకుంది.

తాజా వార్తలు