ఈ వారంలోనే రవితేజ సారొచ్చారు ఆడియో!

ఈ వారంలోనే రవితేజ సారొచ్చారు ఆడియో!

Published on Nov 27, 2012 3:39 PM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘సారొచ్చారు’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నవంబర్ 30 అనగా ఈ శుక్రవారం జరగనుంది. ఈ సంవత్సరం వరుస హిట్స్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు.

నారా రోహిత్ తో ‘సోలో’ సినిమా తీసి హిట్ కొట్టిన పరశురాం ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాలో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ కోచ్ అవతారంలో కనిపించనున్నాడు.

తాజా వార్తలు