తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ క్లాసికల్ కామెడీ మూవీలలో ఒకటైన ‘అహనా పెళ్ళంట!’ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఎంతో పాపులర్ అయిన ఈ సినిమాలో కామెడీ స్పెషలిస్ట్ డైరెక్టర్ జంధ్యాల గారి ఉత్తమమైన పనితనం కనపడుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా. డి. రామానాయుడు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మరియు రజినీ హీరో హీరోయిన్లుగా నటించారు. విలక్షణ నటులు నూతన్ ప్రసాద్ మరియు కోట శ్రీనివాసరావు కీలక పాత్రలు పోషించారు.
అలాగే కామెడీ కింగ్ డా. బ్రహ్మానందం తొలి సినిమా ఇదే కావడం విశేషం. కోట శ్రీనివాసరావు అసిస్టెంట్ గా బ్రహ్మానందం నటన అద్భుతం. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి రాజేంద్ర ప్రసాద్ కి స్టార్డం తెచ్చిపెట్టింది. మీ సినిమాల కలెక్షన్స్ లిస్టులో ఈ మూవీ ఉంటే ఓ సారి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు.