బలుపు చిత్రంలో ప్రత్యేక పాత్రలో అడవి శేష్

బలుపు చిత్రంలో ప్రత్యేక పాత్రలో అడవి శేష్

Published on Nov 24, 2012 3:20 PM IST


“కర్మ” మరియు “పంజా” చిత్రాలతో తెలుగు తెరకు పరిచయం అయిన అడవి శేష్ త్వరలో రానున్న రవితేజ చిత్రం “బలుపు”లో ఒక ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్లో మొదలయిన ఈ చిత్ర చిత్రీకరణలో త్వరలో అడవి శేష్ పాల్గొననున్నారు. అయన ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఒక చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ మరియు శృతి హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంజలి రెండవ కథానాయికగా నటిస్తుండగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రసాద్ వి పోట్లురి ఈ చిత్రాన్ని పివిపి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు