ఒకే వేదిక మీదకి రానున్న మెగా హీరోస్

ఒకే వేదిక మీదకి రానున్న మెగా హీరోస్

Published on Nov 23, 2012 1:57 PM IST


ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయి ధరం తేజ హీరోగా రానున్న చిత్ర ప్రారంభోత్సవం మెగా అభిమానులకు కన్నులపండుగ కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరవనున్నారు. నవంబర్ 24న అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ ప్రారంభోత్సవం జరగనుంది. ఇలా వీరందరినీ ఒకే వేదిక మీద చూడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది ఈ చిత్రం చిరంజీవి అల్లుడయిన సాయి ధరం తేజ చిత్రం కావడంతో ఇది సాధ్యమయ్యింది. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దిల్ రాజు సహా నిర్మాణం అందిస్తున్నారు. ఈ చిత్ర బృందం గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు ఇదిలా ఉండగా సాయి ధరం తేజ వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రేయ్” చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నారు

తాజా వార్తలు