టాలీవుడ్లో కూడా ఇప్పుడది కనిపిస్తోంది.!

టాలీవుడ్లో కూడా ఇప్పుడది కనిపిస్తోంది.!

Published on Nov 23, 2012 1:00 PM IST

తమిళ చిత్ర పరిశ్రమ నుండి తెలుగు వారికి దగ్గరైన మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ ప్రస్తుతం రెండు క్రీజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి వి.వి వినాయక్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రానున్న ‘నాయక్’ కాగా, మరొకటి పూరి జగన్నాథ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు మెగా ఫ్యామిలీ వారు కావడం మరియు రెండు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఇంకో హీరోయిన్ తో తెర పంచుకోవడం పై అభిప్రాయాన్ని అడిగితే ‘ ఓ సినిమా తీయడానికి మంచి స్టొరీతో పాటు గ్లామర్ మరియు కమర్షియల్ అంశాలు కూడా చాలా అవసరం. మన వాళ్ళు ఎప్పటి నుండో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న మూవీస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకో హీరోయిన్ తో తెర పంచుకోవడం మంచిదే కదా’ అని అమలా పాల్ అంది.

అలాగే మాట్లాడుతూ ‘ తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాను. తమిళంలో రియాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, ఇప్పుడు తెలుగులో కూడా అదే రియాలిటీ కనిపిస్తోందని’ అన్నారు.

తాజా వార్తలు