ఈ శుక్రవారమే ఆటోనగర్ సూర్య ఫస్ట్ లుక్

ఈ శుక్రవారమే ఆటోనగర్ సూర్య ఫస్ట్ లుక్

Published on Nov 21, 2012 5:16 PM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ శుక్రవారం ‘ఆటోనగర్ సూర్య’ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. నాగ చైతన్య – సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకి దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పాటల మినహా మిగిలిన చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ చిత్ర ప్రొడ్యూసర్ కొన్ని ఇబ్బందుల్లో ఉండడం వల్ల రిలీజ్ ఆలస్యమవుతోంది. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి కానున్నాయి. ‘ఆటోనగర్ సూర్య’ విజయవాడ నేపధ్యంలో జరిగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. దేవా కట్టా గతంలో ‘వెన్నెల’ మరియు ‘ప్రస్థానం’ సినిమాలు తీసారు.

తాజా వార్తలు