ఢమరుకం సినిమాకి కొత్త డేట్ వచ్చింది

ఢమరుకం సినిమాకి కొత్త డేట్ వచ్చింది

Published on Nov 20, 2012 9:02 PM IST


అక్కినేని నాగార్జున, అనుష్క జంటగా నటించిన ‘ఢమరుకం’ ఇప్పటికి మూడు సార్లు విడుదల తేదీ ప్రకటించి వాయిదా పడిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత ఆర్ఆర్ వెంకట్ భారీ స్థాయిలో ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వస్తుంది. తాజాగా నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23న ఢమరుకం సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఈ రోజు సాయంత్రం తెలిసింది. విడుదల సంభందించిన పూర్తి వివరాలు రేపు అధికారికంగా నాగార్జున, అనుష్క, నిర్మాతలు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు