విజయ్,కాజల్ ప్రధాన పాత్రలలో వస్తున్న “తుపాకి” నవంబర్ 9న భారీ విడుదలకు సిద్దమయ్యింది. తమిళంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం తెలుగులోకి శోభారాణి ఎస్వీఆర్ మీడియా మీద అనువదించారు. ఈ చిత్రం అనువాద హక్కుల కోసం భారీ మొత్తం చెల్లించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోని అక్టోబర్ 29న విడుదల చెయ్యనున్నారు. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మధ్యనే విడుదల అయిన ఈ చిత్రం తమిళ ట్రైలర్ అద్భుతమయిన స్పందన సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలా భాగం ముంబైలో చిత్రీకరించారు.”బిల్లా 2″ చిత్రంలో విలన్ గా కనిపించిన విద్యుత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో విజయ్ ఇంతవరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చెయ్యలేదు శంకర్ దర్శకత్వంలో వచ్చిన “స్నేహితుడు” చిత్రం కూడా ఇక్కడ దారుణంగా పరాజయం పొందింది. “తుపాకి” చిత్రంతో అయినా విజయ్ విజయం దక్కించుకుంటాడో లేదో చూడాలి మరి.
అక్టోబర్ 29న రానున్న తుపాకి ఆడియో?
అక్టోబర్ 29న రానున్న తుపాకి ఆడియో?
Published on Oct 27, 2012 10:20 PM IST
సంబంధిత సమాచారం
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- శ్రీను వైట్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!
- అల్లు ఫ్యామిలీకి GHMC షాక్.. కూల్చేస్తామంటూ నోటీసులు..!
- పిక్ టాక్ : ‘మన శంకర వరప్రసాద్ గారు’ చాలా కూల్ అండీ..!
- AA22 కోసం అట్లీ రెక్కీ.. ఎక్కడో తెలుసా?
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- టాక్.. ‘కాంతార 1’ కి కూడా పైడ్ ప్రీమియర్స్?
- ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి పవర్ఫుల్ పోస్టర్ తో సాలిడ్ అప్డేట్!
- వరల్డ్ వైడ్ ‘లిటిల్ హార్ట్స్’ 4 రోజుల వసూళ్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?