దర్శకుడు శ్రీను వైట్ల దగ్గర ఆస్థాన ఉమ్మడి కథా రచయితలుగా పేరు తెచ్చుకున్న కోనా వెంకట్ మరియు గోపి మోహన్ లు ప్రస్తుతం వరుసగా పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కథలు అందిస్తున్నారు. వీరిద్దరూ తాజాగా ఎన్.టి.ఆర్ ‘బాద్షా’, వెంకటేష్ ‘షాడో’ మరియు మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’ చిత్రాలకు కథనందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం ఒక కథని సిద్దం చేస్తున్నారు. ఈ విషయాన్ని కోనా వెంకట్ గారే తెలిపారు. ‘ మరోసారి నేను మరియు గోపి మోహన్ కలిసి బాలకృష్ణ గారితో మొదటి సారి ఓ సినిమా చేయబోతున్నాం. ఒక కొత్త టీం మరియు ఒక కొత్త థీంతో బాలయ్య సినిమాని ప్లాన్ చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని’ కోనా వెంకట్ తన ట్విట్టర్లో తెలిపారు. ఇప్పటి వరకు పలు పెద్ద హీరోలతో సినిమాలు చేసి విజయాలు అందుకున్న ఈ ఉమ్మడి రచయితలు బాలకృష్ణ గారితో కూడా ఒక మంచి సినిమా తీసి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.
బాలయ్య కోసం కథ సిద్దం చేస్తున్న ఉమ్మడి రచయితలు
బాలయ్య కోసం కథ సిద్దం చేస్తున్న ఉమ్మడి రచయితలు
Published on Oct 16, 2012 2:17 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్‌ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్‌కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!