బాలయ్య కోసం కథ సిద్దం చేస్తున్న ఉమ్మడి రచయితలు

బాలయ్య కోసం కథ సిద్దం చేస్తున్న ఉమ్మడి రచయితలు

Published on Oct 16, 2012 2:17 PM IST


దర్శకుడు శ్రీను వైట్ల దగ్గర ఆస్థాన ఉమ్మడి కథా రచయితలుగా పేరు తెచ్చుకున్న కోనా వెంకట్ మరియు గోపి మోహన్ లు ప్రస్తుతం వరుసగా పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కథలు అందిస్తున్నారు. వీరిద్దరూ తాజాగా ఎన్.టి.ఆర్ ‘బాద్షా’, వెంకటేష్ ‘షాడో’ మరియు మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’ చిత్రాలకు కథనందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం ఒక కథని సిద్దం చేస్తున్నారు. ఈ విషయాన్ని కోనా వెంకట్ గారే తెలిపారు. ‘ మరోసారి నేను మరియు గోపి మోహన్ కలిసి బాలకృష్ణ గారితో మొదటి సారి ఓ సినిమా చేయబోతున్నాం. ఒక కొత్త టీం మరియు ఒక కొత్త థీంతో బాలయ్య సినిమాని ప్లాన్ చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని’ కోనా వెంకట్ తన ట్విట్టర్లో తెలిపారు. ఇప్పటి వరకు పలు పెద్ద హీరోలతో సినిమాలు చేసి విజయాలు అందుకున్న ఈ ఉమ్మడి రచయితలు బాలకృష్ణ గారితో కూడా ఒక మంచి సినిమా తీసి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.

తాజా వార్తలు