అక్కినేని నాగార్జున బిజీ బిజీగా మారిపోయారు. ఆయన నటించిన రాజన్న చిత్రం డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆయన దశరద్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సంతోషం’ భారీ విజయం సాధించింది. ఇటీవలే దశరద్ దర్శకత్వలో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి.శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తారు. ప్రస్తుతం నాగార్జున శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వలో ‘డమరుకం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘షిర్డీ సాయి’ , రామ్ గోపాల్ వర్మ తీయబోయే ‘రామాయణం’ చిత్రాల్లో నటిస్తారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!