ఆస్కార్ అవార్డ్స్‌లో సందడి చేసిన తెలుగు హీరో

oscars

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్‌లో ఇండియన్ స్టార్స్ చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అయితే, టాలీవుడ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇండియన్ స్టార్స్‌కు అకాడమీ అవార్డ్స్ ప్రాధాన్యతను ఇస్తోంది. దీంతో ఇటీవల జరిగిన 97వ అకాడమీ అవార్డ్స్ వేడుకకు పలువురు ఇండియన్ స్టార్స్‌కు ఆహ్వానం అందింది.

వారిలో మన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి కూడా ఒకరు. డైరెక్టర్ మారుతి అండ్ టీమ్ నుంచి వచ్చిన ‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరు’ సినిమాలో హీరోగా నటించి మెప్పించిన రాజ్ దాసిరెడ్డి ఈ ఆస్కార్ అవార్డ్స్‌లో సందడి చేయడం విశేషం. ప్రస్తుతం ఆయన ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం శిక్షణ తీసుకుంటుండగా, ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Exit mobile version