కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1000 కోట్ల మేర వసూళ్లకు సమీపించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది.
కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇలా ఓ ఇండియన్ సినిమాను ఇంగ్లీష్ డబ్ వెర్షన్లో రిలీజ్ చేయడం ఇదే ప్రథమం. దీంతో కాంతార చాప్టర్ 1 మరో ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుంది.
ఇక ఈ సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌ను 2 గంటల 14 నిమిషాల 45 సెకన్ల రన్టైమ్తో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మరి ఈ వెర్షన్లో ఎలాంటి సీన్స్ తొలిగించారో తెలియాలంటే ఇంగ్లీష్ డబ్బింగ్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.