‘స్పిరిట్’ కోసం ఆ ట్రెండ్ ఫాలో కానున్న సందీప్ రెడ్డి..?

Spirit

కల్ట్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఈ సెన్సేషనల్ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై సినీ సర్కిల్స్, సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

అయితే, ఇప్పుడు ఈ ‘స్పిరిట్’ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఉన్న సీక్వెల్ ట్రెండ్‌లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ‘స్పిరిట్ 1’, ‘స్పిరిట్ 2’ అంటూ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడట.

కాగా, ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తు్న్నాడు.

Exit mobile version